Step into an infinite world of stories
"నేను' - 'నా' అన్న భావన ప్రాకృతికంగా, సహజాతంగా మనకుంటుంది. 'నేను' అన్నది ఈ ప్రపంచ అస్థిత్వానికి పునాది... ఈ నవలలో నేను చెప్పదలచుకున్న విషయం ఒక్కటే - 'నేను' ప్రధానం.... తతిమ్మా సంబంధాలన్నీ మన జీవితపు బండి నడపడానికుపకరించేవే.... 'నేను' - 'జీవితం' రెండూ ఒకటేననుకుంటే ఈ నవలలో రెండు ఎప్పటికీ కలవని పాత్రల ద్వారా నాయకుడి బండి దొర్లిపోతుంది.... ఆ రెండు దాదాపు ఒకే సమయంలో ఆగిపోతే నాయకుడి జీవితపు బండి ఆగిపోతుందా? ఈ ప్రశ్నను పాఠకులకు వదిలేసి ఆపేసాను.... ప్రతి సంబంధం దిగంతం లాంటిదే... అదో నిరంతర భ్రమ అని చెప్తూ... మన ప్రపంచం, మన జీవితం మన వైయక్తికానుభూతులే... మన మన ప్రపంచాల అస్థిత్వం మనకు మాత్రమే... మన ప్రపంచం మన ప్రాణప్రదమైన వ్యక్తుల ప్రపంచం రెండూ వేరు వేరు... ఈ విషయాన్ని కొద్దిపాటి కంగాళీతో మేళవించి కొంత హాస్యాన్ని జోడించి 'నేను' చెప్పగలిగినట్టు 'నా'దైన శైలిలో చెప్పాను. - కాశీభట్ల వేణుగోపాల్"
© 2022 Storyside IN (Audiobook): 9789355446541
Release date
Audiobook: 15 July 2022
English
India