Step into an infinite world of stories
కూతురిగా తండ్రిచాటు బిడ్డగానే ఉండి పోయింది వసంత. పెళ్ళి పేరుతో మరో జీవితంలోకి అడుగు పెట్టి ఇరవయ్యేళ్ల బానిస జీవితంలో తనకంటూ ఒక అస్తిత్వం ఉందని కూడా మర్చి పోయే దశలో మేల్కొన్న వసంత జీవితం ఈ కథ. మనిషిగా తననూ గుర్తించమన్న వేడుకోలుగా కాక ఒక తిరుగు బాటుగా ఉంటుందీ కథ. భర్త లేని జీవితానికి ఏ భధ్రతా ఉండదని భయపడిన వసంత, తర్వాతి కాలంలో తానే ఒక ఆధారమై నిలదొక్కుకుంటుంది. ఒక స్థాయికి వచ్చాక మనుషులలో ఉండే రకరకాల కోణాలు అర్థమవుతాయి. ఏటికి ఎదురీదటం ఎలాగో తెలుస్తుంది. చివరలో తన కూతురికి రాసిన ఉత్తరంలో ఇలా రాస్తుంది వసంత.. స్తీ తన జీవితంలో ఏదో ఒకరోజు మహిళగా, మానవిగా మారాల్సిన రోజు వస్తుంది. మహిళగా, మనిషిగా ఎదగటానికి ప్రాణాలను ధారపోసైనా పోరాడాలని చెబుతుంది. నిజానికి ఈ కథ ఏ గుర్తింపుకూ నోచుకోని మహిళల గొంతుక. ఇది వసంత కథ మాత్రమే కాదు ఎన్నో నిజమైన జీవితాలకి కథా రూపం.
Vasantha had been a daughter, a father’s pet all her life. This is the story of Vasantha who entered into a marital relationship about 20 years ago only to forget her own identity as a human. Yet, the story of Vasantha is not an urge to be recognized as a human but an assertion of her identity. Vasantha’s journey as a human being is replete with various encounters with humans. She understands the trick to swim against the tide. In the end, Vasantha writes a letter to her daughter: ‘There comes a day when a woman realizes that she’s a human too. It is then that she should withstand and assert herself putting everything at stake if need be.’ This story is the story of many women’s silent rebellion.
© 2021 Storyside IN (Audiobook): 9789354834899
Release date
Audiobook: 6 October 2021
English
India